Danam Nagender : కాంగ్రెస్‌లో BRSLP విలీనం.. దానం సంచలన వ్యాఖ్యలు TG: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలే అని జోస్యం చెప్పారు. త్వరలో కాంగ్రెస్‌లో BRSLP విలీనం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ఆఫీస్‌ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపాడని విమర్శించారు. By V.J Reddy 12 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Danam Nagender About BRS Party : ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) లో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలే అని అన్నారు. త్వరలో కాంగ్రెస్‌లో BRSLP విలీనం అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీస్‌ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపాడని విమర్శించారు. కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ కూడా దొరికేది కాదని అన్నారు. ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారని ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) లో స్వేచ్ఛ ఉంది కాబట్టే ఎమ్మెల్యేలు చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు... అందుకే విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని అన్నారు. 10 ఏళ్లలో కేటీఆర్ బినామీలు వేల కోట్లు దండుకున్నారని ఆరోపణలు చేశారు. త్వరలో సాక్షాలతో బయటపెడుతా అని చెప్పారు. సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే.. ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారు అని విమర్శించారు. Also Read : అనంత్ అంబానీ – రాధిక పెళ్ళికి మహేష్ బాబు.. వైరల్ అవుతున్న సూపర్ స్టార్ న్యూ లుక్! #brs #congress #brslp-leader #danam-nagender మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి