Mahesh Babu And Family Attends Anant Ambani’s Marriage : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహం మహోత్సవం నేడు (జూలై 12న) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అతిథులుగా రానున్నారు. ఇప్పటికే పలువురు బడా పారిశ్రామిక వేత్తలు, సహాలీవుడ్ తారలు కిమ్ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్, ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు ముంబై చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..Mahesh Babu : అనంత్ అంబానీ – రాధిక పెళ్ళికి మహేష్ బాబు.. వైరల్ అవుతున్న సూపర్ స్టార్ న్యూ లుక్!
ఈరోజు ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలకు హీరో మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు. ఇందులో మహేష్ న్యూలుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
Translate this News: