Medigadda : మూడు బ్యారేజీల్లో డ్యామేజ్ లున్నాయి.. మేడిగడ్డను సందర్శించిన కాంగ్రెస్ మంత్రులు

నలుగురు కాంగ్రెస్ మంత్రులతో కూడిన బృందం శుక్రవారం కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. 5 పిల్లర్లు 5 ఫీట్లు కుంగిపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్ట్ ప్లాన్ మార్చేసి లక్ష కోట్ల ఖర్చులు చూపించిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి పరిశీలన తర్వాత సీఎంకు నివేదిక ఇస్తామన్నారు.

Medigadda : మూడు బ్యారేజీల్లో డ్యామేజ్ లున్నాయి.. మేడిగడ్డను సందర్శించిన కాంగ్రెస్ మంత్రులు
New Update

Medigadda : నలుగురు కాంగ్రెస్ (Congress) మంత్రులతో కూడిన బృందం శుక్రవారం కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే న్యాయవిచారణకు ఆదేశించాలని నిర్ణయించగా.. నేరుగా ప్రాజెక్టు వద్దకే వెళ్లి అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేశారు. రీ డిజైన్‌ మొదలుకొని సాగులోకి వచ్చిన ఆయకట్టు వరకు అన్ని అంశాలను ఈ బృందం లోతుగా పరిశీలించారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌ తదితరులు శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించి.. ఇంజినీర్లు, గుత్తేదారులతోనూ చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మేడిగడ్డ కుంగిన కేసీఆర్ ఎందుకు నోరు తెరవలేదని ప్రశ్నించారు. మెడీ గడ్డలో ఐదు పిల్లర్లు 5 ఫీట్లు కుంగిపోయాయని, రూ. 35 కోట్లతో అనుకున్న ప్రాజెక్టు లక్షకోట్లకు ఎలా పెరిగిందన్నారు. అలాగే కుంగినపుడు పెద్ద శబ్ధాలు వచ్చాయని స్థానికులు చెప్పారన్న ఆయన.. కాళేశ్వరం అప్పు 13 వేల కోట్లు భారంగా మారిందని తెలిపారు. మొదటినుంచే మాకు అనుమానాలున్నాయి. మా విజిట్ తర్వాత సీఎంకు నివేదిక ఇస్తాం. మూడు బ్యారేజీల్లో అవినీతి జరిగింది. డ్యామేజ్ లున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్ట్ ప్లాన్ మార్చేసి లోకేషన్ మార్చేసినందువల్లే ఇలా జరిగిందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి : MISSING: ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. వందల కిలోమీటర్లు ప్రయాణించిన వశిష్ట.. ఎక్కడ దొరికిందంటే!

ఇక కోమట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణహిత ఎందుకు వద్దనుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల సంపదను కాపాడాల్సింది పోయి ఎందుకిలా చేశారంటూ ఈఎన్సీ అధికారి మురళిధర రావుపై కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిపుణుల కమీటీ వేసి ఇందుకు సంబంధించిన పూర్తి అవినీతిని బయటకు లాగుతామన్నారు. ఇక దీనిపై స్పందించిన ఈఎన్సీ అధికారి మురళీధర రావు.. పోలీసులు ప్రాధమిక విచార చేశారని తెలిపారు. వారం పది రోజుల్లో మళ్లీ పనులు మొదలుపెడతామన్నారు. మిగతా మూడు గెట్లను సరిచేయాల్సివుందని వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి వివరాలు, ప్రాణహిత-చేవెళ్లను రీడిజైన్‌ చేసి చేపట్టిన ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా సమర్థించుకొంటారు, పాత, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం, కొత్త, స్థిరీకరణ ఆయకట్టు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలు, పరిష్కారాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్‌ సూచించారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకొన్న ప్రధాన కాంట్రాక్టర్లు, సబ్‌ కాంట్రాక్టర్లను కూడా పిలవాలని ఆదేశించారు. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు పరిధిలోని చీఫ్‌ ఇంజినీర్లందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఏడుగురు చీఫ్‌ ఇంజినీర్ల పరిధిలో ఈ ప్రాజెక్టు ఆయకట్టు ఉంది.

2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. 2022 ఏప్రిల్‌ 28న మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి రాసిన లేఖలో బ్లాక్‌-7, 17, 18, 19, 20 తూముల(వెంట్స్‌)కు దిగువన బాయిలింగ్‌ ఆఫ్‌ వాటర్‌ను అరికట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులోనే దిగువన సీసీ బ్లాకులు పక్కకు జరిగాయని కూడా రాశారు. ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కూడా అందులో రాశారు. ఎక్కడ సమస్య ఉందని రాశారో అక్కడే 2023 అక్టోబరులో బ్యారేజీ కుంగింది. పియర్స్‌ దెబ్బతిన్నాయి. 2022 ఏప్రిల్‌కు ముందు కూడా డి.ఇ.ఇ.లు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. అయినా పట్టించుకోలేదు. జూన్‌లోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకుంటే వచ్చే సీజన్‌లో నీటిని నిల్వ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటన తర్వాత ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

#telangana #komati-reddy #mp-uttam-kumar-reddy #madigadda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe