MP Elections: కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఆరు గ్యారెంటీల దరఖాస్తు ప్రక్రియ అందుకేనా?

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో 10 ఎంపీ స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం ఎంపీ టికెట్ ఎవరికి కేటాయించాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.

Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ
New Update

Congress MP Elections: వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని నాగ్ పుర్ లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. అలాగే ఇండియా కూటమి నేతలు కూడా ఈ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు దాదాపు 10లక్షల మంది హాజరవుతారని తెలుస్తోంది. ఈ బహిరంగ సభ నుంచే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల విజయానికి కార్యాచరణ చేపట్టనుంది. పార్లమెంట్ ఎన్నికల కొరకు కార్యకర్తలందరూ సిద్ధం కావాలని పిలుపునివ్వనుంది.

ALSO READ: పార్లమెంట్ ఎన్నికలు.. నేడు తెలంగాణకు అమిత్ షా

ఎంపీ ఎన్నికలు.. ఆరు గ్యారెంటీలపై ధీమా...

తెలంగాణలో ఆరు గ్యారెంటీల హామీతో అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం.. తెలంగాణలోని ఎంపీ స్థానాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో 10 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఎంపీ టికెట్ కేటాయింపులపై కాంగ్రెస్ హైకమాండ్ తో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే, తాజాగా తెలంగాణ నుంచి ఎంపీ గా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. తాము సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయమని కోరినట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వెల్లడించించారు. ఇదిలా ఉండగా తెలంగాణ పగ్గాలను ఆరు గ్యారెంటీలతో చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలను కూడా ఈ ఆరు గ్యారెంటీలను వాడుకొని గెలవాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టారని చర్చ సాగుతోంది. అయితే ఈ ఆరు గ్యారెంటీల ప్రభావం ఎంపీ ఎన్నికలపై పడుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.

ALSO READ: రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!

#parliament-election #telangana-congress #congress-six-guarantees #mp-elections-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe