Congress: హైదరాబాద్‌లో ప్రభావం చూపని కాంగ్రెస్.. కారణం అదేనా.. ?

తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే రాజధాని నగరంలో జరుగుతున్న అభివృద్ధి బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక ఓటును చీల్చిందని చెబుతున్నారు.

Congress: హైదరాబాద్‌లో ప్రభావం చూపని కాంగ్రెస్.. కారణం అదేనా.. ?
New Update

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో గెలిచి అధికారాన్ని కైవశం చేసుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే తెలంగాణ అంతంటా కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. హైదరాబాద్‌లో ప్రభావాన్ని చూపించలేకపోయింది. బీఆర్‌ఎస్ పార్టీ వైపే ఇక్కడి స్థానికులు మొగ్గుచూపారు. అయితే మరీ కాంగ్రెస్ ఇలా రాజధాని నగరంలో డీలా పడిపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్‌ అంటే గుర్తుకొచ్చేది ఐటీ. చాలావరకు ఐటీ దిగ్గజ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ సరైన అభివృద్ధి, సుస్థిరమైన ప్రభుత్వం లేకుంటే నష్టపోతామని వ్యాపారులు, ఉద్యోగులు, వివిధ రంగాల నిపుణులు భావించడం వల్ల కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత పది సంవత్సరాల్లో చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, మెట్రో విస్తరణ లాంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ రావాలని భావించడం కూడా ఓ కాంగ్రెస్ ఓటమికి కారణమని అంటున్నారు.

Also read: రేవంతే ముఖ్యమంత్రి!.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క?

అలాగే బీజేపీ పార్టీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంతో ఆ ప్రభావం కాంగ్రెస్‌ పార్టీపై పడింది. అంతేకాది బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్‌ రూంలు ఇస్తామని బీఆర్‌ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో అక్కడ ఉండే పేద, మధ్యతరగతి కుటుంబాలు కూడా బీఆర్‌ఎస్‌కే ఓటు వేశాయి. అలాగే జంటనగరాల్లో 24 గంటల కరెంట్‌, తాగునీరు, ప్రజారవాణ బాగుండటం కూడా బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్ని దగ్గరయ్యేలా చేశాయి. అలాగే పచ్చదనం పెంచడంతో సహా..జీహెచ్‌ఎంసీ పరిధిలో సదుపాయాలు ఓటర్లు ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీ స్థానాల్లోనే దాదాపుగా బీఆర్ఎస్‌ విజయం సాధించింది. ఇక్కడ అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతోంది కాబట్టి.. అధికారంలో ఉన్న పార్టీ ఉంటే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చాలామంది భావించడం వల్లే బీఆర్‌ఎస్‌ ఇక్కడ మళ్లీ తమ స్థానాలను నిలబెట్టుకోగలిగిందని నిపుణులు చెబుతున్నారు.

#telugu-news #congress #telangana-elections-2023 #telangana-results
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe