Congress Leader: ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడుతూ.. చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు!

బెంగళూరు కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ లైవ్‌ ప్రెస్ మీట్లో గుండెపోటుకు... గురైయ్యారు. సిద్దరామయ్య కు... హైకోర్టు నుంచి తాత్కలిక ఊరట లభించడంతో ప్రెస్‌ మీట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చనిపోయారు.

New Update
Congress Leader: ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడుతూ.. చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు!

Bengalore: బెంగళూరు ప్రెస్క్లబ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కురుబర సంఘం ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ లైవ్‌ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ..మాట్లాడుతూ కుప్పకూలిపోయారు. ఆయనకు సడెన్‌ గా గుండెపోటు రావడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయనను హుటాహుటిన ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు.

అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా స్కామ్ నుంచి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించడంతో కర్నాటక కాంగ్రెస్ నేతలు బెంగళూరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీకే రవిచంద్రన్ కూడా పాల్గొన్నారు. మాట్లాడటం మొదలుపెట్టిన కొన్ని సెకన్లకే ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కూర్చున్న కుర్చీలో నుంచి అమాంతం కిందపడిపోయారు.

దీంతో పక్కన ఉన్నవారు అలెర్ట్‌ అయ్యి...సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

Also Read: హైదరాబాద్‌ లో కుండపోత..మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు!

Advertisment
తాజా కథనాలు