కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదు... రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు...

దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆర్ఎస్ఎస్ తమ సొంత వ్యక్తులను చొప్పిస్తోందన్నారు. కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదన్నారు. మంత్రి వర్గంలో ఏం జరగాలనేది ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ పెద్ద మనిషి నిర్ణయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులను అడిగినా నిజం చెబుతారన్నారు. తాము తమ మంత్రిత్వ శాఖలను నడపడం లేదని కేంద్ర మంత్రులు చెబుతారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నియమించిన వ్యక్తులు ఆ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారని చెప్పారు.

author-image
By G Ramu
కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదు... రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు...
New Update

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆర్ఎస్ఎస్ తమ సొంత వ్యక్తులను చొప్పిస్తోందన్నారు. కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదన్నారు. మంత్రి వర్గంలో ఏం జరగాలనేది ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ పెద్ద మనిషి నిర్ణయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులను అడిగినా నిజం చెబుతారన్నారు. తాము తమ మంత్రిత్వ శాఖలను నడపడం లేదని కేంద్ర మంత్రులు చెబుతారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నియమించిన వ్యక్తులు ఆ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారని చెప్పారు. వాళ్లే మంత్రిత్వ శాఖలకు అన్ని సూచనలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

భారత దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దేశంలో స్వేచ్ఛను ఏకీకృతం చేసేది రాజ్యాంగమన్నారు. రాజ్యాంగం అనేది నియమాల సముదాయమని చెప్పారు. రాజ్యాంగ సిద్దాంతాలకు మద్దతిచ్చేలా రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. కానీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రం సంస్థాగత నిర్మాణంలో భాగంగా తమ సొంత వ్యక్తులనే కీలక స్థానాల్లో నియమిస్తున్నారని మండిపడ్డారు.

ఇది ఇలా వుంటే రాహుల్ గాంధీ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో పర్యటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన లడఖ్ ప్రాంతంలో మొదటి సారిగా పర్యటిస్తున్నారు. గతంలో ఎస్పీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సిద్దాంతంతో సంబంధం వున్న వాళ్లు గతంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారని పేర్కొన్నారు.

ఆ వాస్తవాలను దాచి పెట్టేందుకే ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఇప్పుడు ప్రతి ఇంటిపై జెండాలు ఎగుర వేయాలని ప్రచారం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లు ఇప్పుడు ‘న్యూ క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని నడుపుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా అప్పులు తీసుకున్న వ్యాపారస్తులు దేశం నుంచి వెళ్లిపోయేలా అనుమతిస్తోందన్నారు.

#decisions #bjp #rss #union-cabinet #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe