Priyanka Gandhi: కేజ్రీవాల్, హేమంత్‌ సొరెన్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ

అరవింద్‌ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను విడుదల చేయాలని కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు.. విపక్ష నేతలపై బలవంతంగా చేపట్టిన చర్యలను ఎన్నికల సంఘం నిలువరించాలన్నారు.

Priyanka Gandhi: కేజ్రీవాల్, హేమంత్‌ సొరెన్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ
New Update

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుగా నిరసనగా ఢిల్లీలోని ఆదివారం రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీలో విపక్ష పార్టీ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్రం.. విపక్ష నేతలను టార్గెట్ చేసి సీబీఐ, దాడులు చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ప్రధానంగా ఐదు డిమాండ్‌లు లేవనెత్తుతోందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ అందరికీ సమానంగా అవకాశాలు కల్పించాలని కోరారు.

Also Read: కనీసం 200 మార్కునైనా దాటుతారా.. బీజేపీకి దీదీ సవాల్.

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు.. విపక్ష నేతలపై బలవంతంగా చేపట్టిన చర్యలను ఎన్నికల సంఘం నిలువరించాలంటూ డిమాండ్ చేశారు. విపక్ష పార్టీలను ఆర్థికంగా నిర్వీర్యం చేయడాన్ని తక్షిణమే ఆపివేయాలన్నారు. అలాగే అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఝూర్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఎలక్టోరల్ బాండ్ల నుంచి బీజేపీకి వచ్చిన నిధులపై విచారణ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు రాహుల్‌గాంధీ కూడా మోదీ సర్కార్‌పై విరుచుకుబడ్డారు. క్రికెట్‌లో కెప్టెన్లు మ్యాచ్‌ ఫిక్సింగ్ చేసి గెలుస్తారని.. రాజకీయాల్లో బీజేపీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోందని విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలని.. వాళ్లు(బీజేపీ) గెలిస్తే రాజ్యాంగాన్ని నాశనం చేస్తారంటూ ధ్వజమెత్తారు. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Also read: ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు-సునీత కేజ్రీవాల్

#telugu-news #national-news #bjp #priyanka-gandhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe