MLC Jeevan Reddy: ఆ పరిస్థితిలో కేటీఆర్ లేడు.. జీవన్ రెడ్డి సెటైర్లు!

మాజీ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీఆర్ బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌నే ప్రజలు మార్చారని చురకలు అంటించారు.

New Update
TG Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా!

MLC Jeevan Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదని ఎద్దేవా చేశారు. వారు ఇంకా అధికారంలో ఉన్నట్లు కలలుకంటున్నారని చురకలు అంటించారు.

ALSO READ: దేవుడు రూపంలో మహేష్ బాబు ఫ్లెక్సీలు.. వైరల్!

ఆ పరిస్థితిలో కేటీఆర్ లేడు..

మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నే ప్రజలు మార్చారని చురకలు అంటించారు. తప్పుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు పడ్డాయని అన్నారు. కేటీఆర్‌ ఆత్మస్తుతి పరనింద నుంచి బయటకు రావాలని పేర్కొన్నారు. కేటీఆర్‌ ఆత్మస్తుతి పరనింద నుంచి బయటకు రాకపోతే ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని అన్నారు.

రైతు రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్..

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించనున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని అన్నారు. రైతుని రాజు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. 32 వేల కోట్లతో నిధుల సమీకరణకు కార్యాచరణ మొదలైందని తెలిపారు. ఒక్కో రైతు అసలు, వడ్డీ లెక్కింపు చేస్తోందని పేర్కొన్నారు. రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ అభ్యర్థుల ఖరారుపై చర్చించనున్నారు. అలాగే నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులపైనా అధిష్ఠానంతో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ALSO READ: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.8,000!

Advertisment
తాజా కథనాలు