Telagana: మహిళలపై అఘాయిత్యాలు.. రాబర్ట్‌ వాద్రా కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య, కూతురుతో సహా దేశ మహిళలందరూ మేము భద్రంగా ఉన్నామని భావించే రోజులు రావాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని ఆయన దర్శించుకున్నారు.

New Update
Telagana: మహిళలపై అఘాయిత్యాలు.. రాబర్ట్‌ వాద్రా కీలక వ్యాఖ్యలు

ఈమధ్య మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్న ఘటనలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య, కూతురుతో సహా దేశ మహిళలందరూ మేము భద్రంగా ఉన్నామని భావించే రోజులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Also read: రేవంత్ సర్కార్‌ కీలక నిర్ణయం.. హైడ్రాలో మరిన్ని పోస్టులు

ప్రస్తుతం దేశంలో మహిళల భద్రత అనేది ప్రధాన సమస్యగా ఉందని.. తన భార్యాబిడ్డలతో సహా దేశంలో ఉన్న మహిళంలదరూ సేఫ్‌గా ఉన్నామని ఫీలయ్యే రోజులు రావాలని అన్నారు. అలాగే మహిళలు సేఫ్‌గా ఉండాలంటే వాళ్లతో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్పించాలని సూచించారు. దేశంలో సమస్యలను తాను, రాహుల్ గాంధీ ఒకే కోణంలో చూస్తామన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుతున్నారని.. మరో ఐదేళ్ల తర్వాత మార్పును చూస్తారని తెలిపారు.

Also Read: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. 2,364 మంది రెగ్యులరైజ్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు