Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ అప్పుడే.. ఆశావహులకు హైకమాండ్ కీలక ఆదేశాలు!

తెలంగాణ కాంగ్రెస్ టికెట్ల ప్రకటన మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. చేరికలు పూర్తి అయిన తర్వాత అక్టోబర్ మొదటి వారంలో ఒకే సారి 119 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

New Update
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ అప్పుడే.. ఆశావహులకు హైకమాండ్ కీలక ఆదేశాలు!

తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను తయారు చేయడంలో హైకమాండ్ బిజీగా మారింది. అయితే.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉండడంతో ఇంకా ఫైనల్ లిస్ట్ ను (Telangana Congress MLA Candidates Final List) తయారు చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ రోజు లేదా రేపు వేముల వీరేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి కూడా చేరుకున్నారు. ఇంకా బీజేపీ నుంచి సైతం కాంగ్రెస్లోకి భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది. బీజేపీకి (Telangana BJP) చెందిన దాదాపు పది మంది ముఖ్యనేతలు ఒకేసారి హస్తం గూటికి చేరుతున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

వీరిలో దాదాపు సగం మందికి కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కే అవకాశం ఉందన్న వార్తలతో.. ఆయా స్థానాల్లో టికెట్ ఆశిస్తున్నవారిలో టెన్షన్ నెలకొంది. దీంతో ఆయా నియోజకవర్గాల ఆశావహులు ఢిల్లీ బాట పడుతున్నారు. హైకమాండ్ పెద్దలను కలిసి తమకే టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించే వారు ఢిల్లీకి రావొద్దంటూ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

అయితే.. ఈ నెలాఖరుకు ఇతర పార్టీల నుంచి చేరికలను పూర్తి చేసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. చేరికలన్నీ పూర్తయిన తర్వాత అక్టోబర్ మొదటి వారంలో టికెట్లను ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోంది. విడతల వారీగా కాకుండా ఒకే సారి 119 మంది అభ్యర్థులను ప్రకటించాలన్నది ఆ పార్టీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తమ ముఖ్య హామీలపై ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఈ నెల చివరిలోగానే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై క్లారిటీ వస్తుందని ముఖ్య నేతలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:
Telangana Elections: మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా?

Telangana Elections: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: సీఈవో

Advertisment
తాజా కథనాలు