Telangana: రేపే మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనున్న కాంగ్రెస్‌

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల వేదికగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనుంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

New Update
CM Revanth Reddy: వాటిని మాకు మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌ వినతి..

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో సభ నిర్వహించనున్నారు. ఈ సభలో చేవెళ్ల వేదికగా.. మరో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించనుంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అయితే ఈ సభకు ఆమె నేరుగా హాజరుకావడం లేదు. వర్చువల్‌గా ఆమె సభలో ప్రసంగించనున్నారు.

Also read: ఎంపీగా పోటీ చేసి తీరుతా.. తేల్చి చెప్పిన వీహెచ్..!

అయితే లబ్దిదారులు సిలిండర్‌ ధరను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రం ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో సొమ్మును డిపాజిట్ చేస్తుంది. ఉదాహరణకు.. సిలిండర్ ధర రూ.955 ఉంటే లబ్ధిదారుడు రూ.955 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.40 మినహాయించి.. మిగతా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తుంది. ఇక 200 యూనిట్ల లోపు కరెంట్‌ వాడే అర్హులకు జీరో బిల్లులు వేయనున్నారు.

Also read: బీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న నాగర్‌కర్నూల్ ఎంపీ..

Advertisment
తాజా కథనాలు