Gruhajyothi Scheme: గృహజ్యోతి పథకం అప్పటి నుంచే.. కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్..

తెలంగాణలో గృహలక్ష్మీ పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఫ్రీ కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్‌.. లోకసభ ఎన్నికల లోపే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Gruhajyothi Scheme: గృహజ్యోతి పథకం అప్పటి నుంచే.. కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్..
New Update

తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఫ్రీ కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ పథకాన్ని లోక్‌సభ ఎన్నికల్లోపే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ సర్కార్‌ ఈ పథకం అమలుపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా లబ్ధిదారుల ఎంపికపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఏ అంశాలను ప్రమాణికంగా తీసుకోని లబ్ధిదారులను ఎంపిక చేస్తారో తెలియక గందరగోళం నెలకొంది.

ఏటా రూ.కోట్లు ఖర్చు

అయితే ఈ గృహజ్యోతి పథకం అమలు చేసేందుకు ప్రతి సంవత్సరం రూ.10 కోట్లు ఖర్చు కానున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా ఇటీవల రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ రంగం ఇబ్బందుల్లో ఉన్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థ (జెన్ కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్ కో), ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.81 వేల కోట్ల రుణాలు ఉన్నాయని.. అలాగే రూ.50 వేల కోట్లకు పైగా నష్టాలు ఉన్నట్లు చెప్పారు.

అన్ని అప్పులే 

అయితే తెలంగాణ ఏర్పడిన కొత్తలో అంటే 2014 జూన్‌ 2 నాటికి ఈ నాలుగు విద్యుత్‌ సంస్థల ఆస్తులు 44,344 కోట్లు ఉండగా.. రూ.22,423 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీలో వివరించారు. అయితే ఇప్పుడు విద్యుత్‌ రంగ ఆస్తులు 1,37,570 కోట్లు ఉండగా.. అప్పులు 81,516 కోట్లు ఉన్నాయని తెలిపారు. అలాగే తమ హయాంలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామని.. 24 గంటల పాటు విద్యుత్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

నాణ్యమైన విద్యుత్ అందిస్తాం

అయితే రాష్ట్ర విద్యుత్‌ రంగ ఆర్థిక పరిస్థితి ప్రమాదంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డిస్కంలు రూ.81,516 కోట్ల నష్టాల్లో ఉన్నాయని.. అలాగే విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ.28,673 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలు కూడా డిస్కంలకు రూ.28,842 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందని చెప్పారు. అలాగే సాగునీటి శాఖకు సైతం రూ.14,193 కోట్ల బకాయిలు ఉన్నట్లు చెప్పారు. విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు వస్తున్న ఇబ్బందుల్లో ఈ బకాయిలే ప్రధాన కారణమని వివరించారు. రోజవారి విద్యుత్‌ కోసం భారీగా అప్పులు చేయాల్సి వచ్చిందని.. అయినప్పటికీ కూడా ఆర్థిర సవాళ్లను ఎదుర్కొని రాష్ట్రానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇటీవల జరిగిన అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు.

#telugu-news #telangana-news #congress #gruhajyothi-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe