రూ.500లకే గ్యాస్ సిలిండర్ పై కీలక అప్డేట్.. రూల్స్ ఇవే!

రూ.500లకే గ్యాస్ సిలిండర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై విధివిధానాలు రూపొందించి. కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసే సమయంలోనే సిలిండర్‌ పథకానికి లింక్‌ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

New Update
రూ.500లకే గ్యాస్ సిలిండర్ పై కీలక అప్డేట్.. రూల్స్ ఇవే!

Update On Gas Cylinder Scheme : తెలంగాణ(Telangana) లో అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్ సిలిండర్(Gas Cylinder) అందిస్తామని కాంగ్రెస్ పార్టీ(Congress Party) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకం యొక్క విధివిధానాలను రూపొందిస్తుంది. తాజాగా రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పతాకంపై కీలక అప్డేట్ వచ్చినట్లు సమాచారం. పథకానికి నిబంధనలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ALSO READ:రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోజు నుంచే వారికి రూ.2,500?

లబ్ధిదారుల ఎంపికపై విధివిధానాలు రూపొందించి ప్రభుత్వానికి పౌరసరఫరాల శాఖ పంపించింది. రేషన్‌ కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాత గ్యాస్‌ కనెక్షన్లకు కూడా ఈ పథకం వర్తించనుంది. కొత్తగా గ్యాస్‌ కనెక్షన్లు తీసుకునే వాళ్లను పరిగణించవద్దన్న పౌరసరఫరాల శాఖ. ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. రేషన్‌ కార్డులతో సంబంధం లేకుండా పథకం అమలు చేసేందుకు తొలుత ప్లాన్‌ చేసింది రాష్ట్ర సర్కార్. ఈ విధానంలో పథకం అమలు లేట్‌ అవుతుందనే అంచనాలో అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 89 లక్షల 98 వేల రేషన్‌ కార్డులు ఉన్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రాయితీని 4లక్షల 20 వేల మంది వదులుకున్నట్లు సమాచారం. మిగతా 85 లక్షల 79 వేల మందిలో.. ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్ల కింద రూ.340 రాయితీ పొందుతున్నారు 11లక్షల58 వేల మంది. ఏడాదికి ఆరు సిలిండర్ల నిబంధన విధించాలని నిర్ణయం త్సినుకున్నట్లు సమాచారం. కొత్త రేషన్‌కార్డుదారులకు పథకం వర్తించేలా ప్లాన్‌ కూడా చేసిందట. ఈనెల 28 నుంచి కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులను రాష్ట్ర సర్కార్ స్వీకరించనున్న విషయం తెలిసిందే. కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసే సమయంలోనే సిలిండర్‌ పథకానికి లింక్‌ చేసే అవకాశం. కలెక్టర్ల సదస్సులో కొత్త రేషన్‌ కార్డులపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ALSO READ:సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు

Advertisment
తాజా కథనాలు