Patel Ramesh Reddy: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి పటేల్ రమేష్ రెడ్డి?

పటేల్ రమేష్ రెడ్డికి షాక్ ఇచ్చింది కాంగ్రెస్. లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. హ్యాండ్ ఇచ్చింది. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని ప్రకటించింది. టికెట్ రాకపోవడంతో పటేల్ రమేష్ పార్టీ మారుతారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.

New Update
Patel Ramesh Reddy: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి పటేల్ రమేష్ రెడ్డి?

Patel Ramesh Reddy: పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్లేట్ ఫిరాయించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. ఈ లిస్టులో నల్గొండ ఎంపీ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేరు ప్రకటించింది. దీంతో తనకు నల్గొండ ఎంపీ టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి చివరికి నిరాశే ఎదురైంది.

ALSO READ: కాంగ్రెస్ తొలి జాబితా.. రాహుల్ గాంధీ పోటీ చేసేది అక్కడి నుంచే!

అప్పుడు బుజ్జగింపు.. మరి ఇప్పుడు?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ను పటేల్ రమేష్ రెడ్డికి కాకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డికి కేటాయించింది. అయితే ఎన్నికల్లో దామోదర్ రెడ్డి ఓటమి చెందారు. అది పక్కకి పెడితే.. సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి కి కాంగ్రెస్ పెద్దలు కీలక హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో అతనికి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు బాండ్ పేపర్ రాసిచ్చారు ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దల హామీతో ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థికి తన మద్దతు తెలిపారు. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో మరోసారి భంగపడ్డారు పటేల్ రమేష్ రెడ్డి. అయితే.. కాంగ్రెస్ పార్టీకి ఆయనకు ఎలాంటి హామీ ఇస్తుందో వేచి చూడాలి.

బీజేపీలో చేరిక?

కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎంపీ టికెట్ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి కేటాయించడంతో.. ఆ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. అయితే.. ఆయన బీజేపీలో చేరుతారని టాక్ వినిపిస్తోంది. నల్గొండ జిల్లాలో బలహీనంగా ఉన్న బీజేపీ పటేల్ రమేష్ రెడ్డి తమ పార్టీలో చేరితే బలం పెరుగుతుందని తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి బీజేపీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ పటేల్ రమేష్ రెడ్డి బీజేపీలో చేరితే నల్గొండ ఎంపీ టికెట్ ఇద్దామని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పటేల్ రమేష్ రెడ్డి బీజేపీలో చేరుతారా? లేదా కాంగ్రెస్ లోనే ఉంటారా? అనేది వేచి చూడాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు