Patel Ramesh Reddy: కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి పటేల్ రమేష్ రెడ్డి?
పటేల్ రమేష్ రెడ్డికి షాక్ ఇచ్చింది కాంగ్రెస్. లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. హ్యాండ్ ఇచ్చింది. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని ప్రకటించింది. టికెట్ రాకపోవడంతో పటేల్ రమేష్ పార్టీ మారుతారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.