తెలంగాణలో రేపు ఓట్ల లెక్కింపు జరగనున్న వేళ.. కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటీ సుధారకర్ రెడ్డి తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీఈవో వికాస్‌రాజ్‌కు నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆ వినతిపత్రంలో.. రైతుబంధు నిధులను గుత్తేదారులకు చెల్లించకుండా చూడాలని కాంగ్రెస్ నేతలు కోరారు. హైదరాబాద్‌లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు కుట్ర జరుగుతోందని.. అలాగే అసైన్డ్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని కోరారు. అలాగే రైతుబంధు నిధులను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని.. అసైన్డ్ భూముల రికార్డులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Also read: బైబై కేసీఆర్.. షర్మిలా సంచలన వ్యాఖ్యలు