Jagga Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందని అన్నారు. సింపతితో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఆరోపించారు. అన్నమాట నిజం చేసినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే 14 సీట్లు గండికొట్టేలా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆ రెండు పార్టీల తీరును గమనించాలని కోరారు. ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న నాటకం ఇదాని అన్నారు.
ALSO READ: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్
చీకటి ఒప్పందాలు..
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నడుమ చీకటి ఒప్పందాలు ఉన్నాయని అన్నారు జగ్గారెడ్డి. కవిత లిక్కర్ కేసు సురభి నాటకంలా మారిందని ఎద్దెవ చేశారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ నడుమ ఒప్పందం కుదిరినట్లు ఉందని.. అందుకే తెర మీదికి కవిత లిక్కర్ స్కాం కేసు వచ్చిందని అన్నారు. ఎన్నికలు రాగానే ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టి లబ్ది చేకూర్చుకునేలా ఆ రెండు పార్టీలు పనిచేస్తాయని పేర్కొన్నారు.
ఇగ కవిత అరెస్ట్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాకా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారని ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పదే పదే చెప్పుకుంటూ తిరిగారని జగ్గారెడ్డి అన్నారు. బండి సంజయ్ ఏది చెప్తుంటే అదే జరుగుతుందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఈడీ కి విలువ లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, మోడీ లవర్స్ అని అన్నారు జగ్గారెడ్డి. లవర్స్ మధ్య ఏం జరుగుతుందో తమకు ఎలా తెలుసు అంటూ సెటైర్లు వేశారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై చర్చించేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపణలు చేశారు.