YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా షర్మిల?

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యురాలిగా కూడా ఆమెను నియమించనున్నట్లు సమాచారం.ఈ విషయంపై నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

New Update
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా షర్మిల?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కి చీఫ్ గా వైయస్ షర్మిలను (YS Sharmila) కాంగ్రెస్ అధిష్టానం నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు సీడబ్ల్యూసీలోకి శాశ్వత సభ్యురాలిగా కూడా ఆమెను నియమించాలని అధిష్టానం డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏఐసీసీ ఈరోజు ప్రకటన చేయనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా షర్మిలకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తోందని సమాచారం. ప్రకటన వెలువడిన వెంటనే షర్మిల విజయవాడకు చేరుకొని పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తారని సమాచారం. కొత్త పీసీసీ చీఫ్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే విజయవాడ కాంగ్రెస్ శ్రేణులు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also read:1978లో వైఎస్సార్.. నేడు షర్మిల.. కాంగ్రెస్ తో వైఎస్ ఫ్యామిలీ 40 ఏళ్ళ అనుబంధం! 

నిన్న కాంగ్రెస్ లో చేరిక..
వైఎస్సార్ టీపీ (YSRTP) అద్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరారు. తన పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు.  కాంగ్రెస్ లో చేరిన షర్మిల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

తన అన్నయ్య, సీఎం జగన్ కు పోటీగా షర్మిల ఏపీలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.  ఆంధ్ర ప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను కోరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎంపీ లేదా ఎమ్మెల్యేగా షర్మిల పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ ఏపీ రాజకీయాలు, కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఉమ్మడి కడప జిల్లా నుంచి పోటీ..
ఉమ్మడి కడప జిల్లా నుంచి పోటీ ఆమె చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రాజంపేట ఎంపీ లేదా కడప, కమలాపురం, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ చేసే ఛాన్స్‌ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వైఎస్‌ఆర్‌ కుమార్తెగా షర్మిలకు వైఎస్‌ సన్నిహితుల మద్దతు ఉండనుంది. రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో అధికంగా వైఎస్‌ సన్నిహితులు ఉన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో కడప జిల్లాలోని వైఎస్‌ఆర్‌ సన్నిహితులు ఆమె వెంట నడిచే ఛాన్స్‌ ఉందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు