Technology: మనిషి మెదడుతో కంప్యూటర్..స్విస్ శాస్త్రవేత్తల సృష్టి

టెక్నాలజీ రోజురోజుకూ డెవలప్ అవుతోంది. ఎంతలా అవుతోందో...ఎక్కడికి చేరుకుంటుందో కూడా ఊహించడం కష్టంగా ఉంటోంది. తాజాగా మానవ మెదడులోని కణజాతం ఆధారంగా కంప్యూటర్ సృష్టించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు.

New Update
Technology: మనిషి మెదడుతో కంప్యూటర్..స్విస్ శాస్త్రవేత్తల సృష్టి

New Invention: ఇప్పటివరకు ఒక లెక్క...ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు స్విస్ శాస్త్రవేత్తలు. కంప్యూటర్ సృష్టికే కారణమైన మానవ మెదడునే కంప్యూటర్‌గా మార్చేశామని చేసి చూపిస్తున్నారు. బ్రెయినోవేర్ అనే పరుతో మనిషి మెదడులోని కణజాలంతో సజీవ కంప్యూటర్ సృష్టించామని ప్రకటించారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ను కలిపి దీన్ని సృష్టించడంతో రెండింటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్‌ అనే పేరు పెటంటామని చెబుతున్నారు. కంప్యూటర్ చిప్ మాదిరిగా సమాచారాన్ని పంచుకునే సామర్ధ్యం ఉండడం దీని ప్రత్యేకత. ఈ కంప్యూటర్ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించగలదని వివరించారు.

అయితే ఈ బ్రెయినోవేర్ ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. దీనిని అందుబాటులోకి తీసుకురావాలంటే చాలా చిక్కులను అధిగమించాలి. అసలు అయితే ఈ కొత్త ఇన్నేవోషన్ కంప్యూటర్ సైన్స్, స్యూరో సైన్స్లలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెబుతున్నారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ మధ్య అంతరాలను చెరిపివేస్తుంది. సామర్థ్యం, కంప్యూటింగ్ పరంగా దీని ప్రయోజనాలు అపారంగా ఉంటాయి. అయితే దీన్ని డెవలప్ చేయడం అంత సులువేమీ కాదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సాధ్యాసాధ్యాలపై మానవ ఆలోచనలను ఇది సవాల్ చేస్తుంది. ఇది మానవ మేధకు పెద్ద సవాలుగా మారుతుంది. కృత్రిమ మేధస్సు, టెక్నాలజీతో మానవత్వం భవిష్యత్తు గురించి కూడా లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. అప్పుడు దీన్ని మనుషులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ప్రశ్నగా మారుతుందని అంటున్నారు.

Also Read:Whats App: మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లు..వాట్సాప్‌లో మరో అప్డేట్

Advertisment
తాజా కథనాలు