కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం సాధారణమే. కొందరు బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి వాళ్లని పట్టిస్తారు. మరికొందరు సైలెంట్‌గా ఉంటారు. అయితే తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) కీలక ప్రకటన చేసింది. తమ సంస్థకు చెందిన సిబ్బంది లేదా అధికారులు లంచం అడిగితే తెలియజేయాలని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. ఇందుకోసం సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. లంచం అడిగితే 040 - 2345 4884 లేదా 7680901912 నంబర్లకు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
Also Read: రాజకీయ దురదృష్టమంతుడు జిట్టా.. జీవితమంతా పోరాటమే!
కొంతమంది సిబ్బంది, అధికారులు లంచాలు తీసుకుంటూ సంస్థకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతిని అడ్డుకునేందుకే ఈ ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు ఉద్యోగులు వినియోగదారులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా లేదా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా సహించేది లేదని తేల్చిచెప్పారు. అలాగే నూతన సర్వీసులు మంజూరు చేయడం, కేటగిరి మార్పు, టైటిల్ ట్రాన్స్‌ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందడానికి కూడా సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అవకాశం కల్పించామని పేర్కొన్నారు.