Telangana Elections 2023: తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కానుంది. ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నవారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులకు కంపెనీలు సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. సెలవు ఇవ్వకపోతే తమకు ఫిర్యాదు చేయాలంటూ కంప్లైంట్ నెంబర్ 1950 కి కాల్ చేయాలనీ కోరింది.
ALSO READ: డబ్బుల కట్టడిలో నిర్లక్ష్యం.. ముగ్గురు పోలీసు అధికారులు ఔట్
ఈ నేపథ్యంలో తాము ఓటు వేసేందుకు తమ కంపెనీలు సెలవు ఇవ్వడం లేదంటూ 1950 కాల్ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయట. సెలవు లేకపోతే ఎలా ఓటు వేయాలని ప్రైవేటు ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. చాలా కంపెనీలు, ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో ఆ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు సీఈవో వికాస్ రాజ్.
తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలకు, స్కూళ్లు, కొన్ని కంపెనీలు సెలవు ఇవ్వడంతో అందరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత ఊర్ల బాట పట్టారు. అన్ని బస్సు స్టాండులు, రైల్వే స్టేషన్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. అయితే, ఎన్నికలు ఉన్నాయని తెలిసిన టీఎస్ ఆర్టీసీ ప్రజలకు బస్సు సౌకర్యం కలిపించడంలో విఫలమైందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.
ALSO READ: తెలంగాణ ఎన్నికలు.. రేపు ఇవి కూడా బంద్