ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. కానీ ఉన్నంతలో కాస్త ఊరట ఏంటంటే ఈసారి ఈ ధర భారీగా పెరగలేదు. కేవలం 20 రూ. మాత్రమే పెరిగింది. అయితే కేవలం ఎల్పీజీ (LPG) అందించే కమర్షియల్ గ్యాస్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. రెండు నెలల్లో ఈ ధర పెరగడం ఇది మూడోసారి. క్రితం నెల కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా 101రూ. పెరిగింది. ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కాస్త శాంతిచడంతో అంతర్జాతీయ చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Also read:అర్థరాత్రి వరకు పోలింగ్.. తెలంగాణ ఓటింగ్ శాతం ఎంతంటే..
కొత్తగా పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఎల్పీజీ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. గల నెల ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రేటు 1.796.5రూ ఉంది. ఒక్క ఢిల్లీలోనే ఏ మార్పూ లేకుండా ధరలు కంటిన్యూ అవుతున్నాయి. కానీ చెన్నైలో ఇదే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1,968.5 రూ ఉండగా, కోలకత్తాలో 1,908రూ గా ఉంది. అయితే ఈ సిలిండర్ ధర పెంపు నిర్ణయం కొందరికి మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రమే పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. రెండు నెలలుగా ఈ సిలిండర్ ధరలు దాదాపు 150రూ పెరిగాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి.
అక్టోబర్ నెల మొదట్లో కేంద్ర మంత్రి వర్గం ఉజ్వల పథకం (Ujjwala Scheme) కింద అదనంగా 75 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లను ఆమోదించింది, దీనిని వచ్చే మూడేళ్ళు ఇస్తామని తెలిపింది. ఈ కనెక్షన్ల మొత్తం వ్యయం 1,650 కోట్లు. ఉజ్వల పథకం కింద అందిస్తోన్న డిపాజిట్ రహిత కనెక్షన్ల కొనసాగింపుగా ఈ కొత్త కనెక్షన్లు ఉంటాయి సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తెలిపారు.