Rain Alert: మరో మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

తెలంగాణను వర్షాలు ముంచెత్తేస్తున్నాయి. నిన్న, ఈ రోజు కాస్త తెరిపిచ్చిందంటే మళ్ళీ మరో మూడు రోజులు తెలంగాణ అంతటా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
Rain Alert: మరో మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

Rain Alert in Telangana: ఎడతెగని వానలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. గత రెండు రోజులుగా కాస్త సూర్యుడు మొహం చూపించాడు. కానీ రానున్న మూడు రోజలు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ చెబుతోంది. వాయువ్యానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాకాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అందుకే వానలు పడతాయని తెలిపారు. దీని ప్రభావం వలన 14వ తేదీన జగిత్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశం దిశగా మెల్లగా వస్తున్నాయని....బంగాళాఖాతంలో మయన్మార్ దగ్గర వాయుగుండం ఏర్పడిందని చెబుతోంది వాతావరణశాఖ. వాయుగుండం మరో రెండురోజుల్లో అల్ప పీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఇది తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే హైదరాబాద్ లో మాత్రం అంత పెద్దగా వానలు పడకపోవచ్చని అంటున్నారు. వాతావరణం పొడిగానే ఉంటుందని చెబుతున్నారు. అప్పుడప్పుడు వానలు పడతాయే తప్ప భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశం లేదని తెలిపారు.

Also Read: 2వేల మందిని మింగిన వరదలు…ఈ దేశంలో ఘోర పరిస్థితులు..!!

Advertisment
తాజా కథనాలు