Hyper Aadi : అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్.. స్పందించిన హైపర్ ఆది, ఏమన్నాడంటే..?

అశ్విన్‌బాబు నటించిన ‘శివం భజే’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్ కు హైపర్ ఆది హాజరయ్యాడు. ఇందులో అల్లు అర్జున్ పై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడారు .'అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న నటుడు. ఆయనను అందరూ గౌరవించాలి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే' అని అన్నాడు.

New Update
Hyper Aadi : అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్.. స్పందించిన హైపర్ ఆది, ఏమన్నాడంటే..?

Comedian Hyper Aadi About Allu Arjun : ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది, టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయొద్దని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు.అల్లు అర్జున్ ఇటీవల ఎపి ఎలక్షన్స్ లో భాగంగా వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొంతమంది నెటిజన్లు అర్జున్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.ఈ ట్రోలింగ్‌పై హైపర్ ఆది స్పందించాడు.

కావాలనే చేస్తున్నారు..

అశ్విన్‌బాబు నటించిన ‘శివం భజే’ ట్రైలర్‌ రిలీజ్‌కు హాజరైన ఆది.. అల్లు అర్జున్‌ గురించి మాట్లాడారు.. "అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న నటుడు. ఆయనను అందరూ గౌరవించాలి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. కొంతమంది అర్జున్‌ను కావాలనే ట్రోల్ చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దు" అని కోరారు.

Also Read : జాన్వీ గురించి అలా మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో గుల్షన్..!

అది నిజం కాదు...

ఇదే ఈవెంట్ లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.."ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తాను. బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటాను. పవన్ కళ్యాణ్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. నాకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు" అని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. దీంతో హైపర్ ఆది చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు