/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bike-jpg.webp)
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ ముస్లిం కుటుంబంపై కొందరు వ్యక్తులు రంగు నీళ్లు పోశారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూసి వేధించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లకి వెళ్తే.. వాస్తవానికి హోలీ పండుగ రేపు. కానీ బధవారం ధాంపూర్ నగరంలో కొందరు వ్యక్తులు పండుగకు ఒకరోజు ముందుగానే హోలీ వేడుకలు జరుపుకున్నారు.
Also Read: కిడ్నాపైన 300 మంది పిల్లలు విడుదల.. ఎక్కడంటే
అలా రోడ్డుపై రంగులు చల్లుకుంటుండగా.. ఓ ముస్లిం కుటంబ సభ్యలు బైక్‌పై ఆ రోడ్డు గుండా వచ్చారు. దీంతో హోలీ ఆడుతున్న కొందరు వ్యక్తులు.. బైక్‌పై ఉన్న ఇద్దరు మహిళలతో పాటు ఒక వ్యక్తిపై బలవంతగా రంగు నీళ్లు పోశారు. అలాగే వాళ్ల ముఖాలకు రంగులు కూడా పూశారు. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ చక్కర్లు కొట్టింది. ముస్లిం కుటంబంపై అలా బలవంతంగా రంగులు పూసి.. వేధించడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వీడియోపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటన జరిగిన ప్రాంత పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.
Also Read: కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి మెగా మార్చ్
क्या यह छेड़खानी नही कहलाएगा??
क्या महिलाओ को रोक कर, धार्मिक नारे लगाकर, ज़बरदस्ती रंग डालना जुर्म नही है??
रमज़ान चल रहा है, लोग खरीदारी करने के लिए बाहर निकलते है!@bijnorpolice#Muslimspic.twitter.com/BAhVmeDoQx
— Zulqarnain ذوالقر نین (@Zulqarn34895931) March 24, 2024
#BijnorPolice
थाना धामपुर क्षेत्र से संबंधित सोशल मीडिया पर वायरल वीडियो के संबंध में स्थानीय पुलिस द्वारा की जा रही वैधानिक कार्यवाही के संबंध में पुलिस अधीक्षक, जनपद बिजनौर की बाइट ।
#UPPolicepic.twitter.com/TBPpgVTIvY— Bijnor Police (@bijnorpolice) March 24, 2024