CM Revanth:విగ్రహం టచ్ చేస్తే ఫామ్ హౌస్‌ల్లో జిల్లెడు మోలిపిస్తా!

రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం మీద చేయిపడితే ఫామ్ హౌస్‌ల్లో జిల్లెడు మోలిపిస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ లేకపోతే దిక్కుమాలినోడు మంత్రి అయ్యేవాడే కాదన్నారు.

author-image
By srinivas
New Update
hyderabad

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ నిప్పులు చెరిగారు. దిక్కుమాలినోళ్ల గురించి ఇష్టం లేకున్నా పదే పదే మాట్లాడాల్సివస్తుందంటూ రాజీవ్ విగ్రహావిష్కరణ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ అనంతరం సీఎం మాట్లాడుతూ.. కొందరు చిల్లర, మల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయ వేదిక కాకపోయినా, తనకు ఇష్టం లేకున్నా దిక్కుమాలినోళ్ల గురించి మాట్లాడక తప్పట్లేదన్నారు.

తెలంగాణలో కోట్లు దోచుచుకున్న వాళ్లు.. గాంధీ కుటుంబం మాట్లాడుతున్నారు. మోతీలాల్ వేల కోట్ల తన ఆస్తి పాస్తులను దేశ స్వాతంత్ర్యం కోసం ఖర్చుచేశారు. స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసింది గాంధీ కుటుంబం. దేశ సమగ్రతను కాపాడింది గాంధీ ఫ్యామిలీ. నెహ్రూ.. దురదృష్టి పాలనతోనే దేశంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. పదే పదే కొందరు సన్నాసులు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు.. ఇందిరా గాంధీ ఏ పదవి తీసుకోలేదు. ఈ విషయం సన్నాసులు గుర్తుంచుకోవాలే. దళిత గిరిజనులకు భూమి పట్టాలు.. ఇందిరమ్మ వరం లక్షల ఎకరాలను పేదలకు పంచింది. ఇందిరా రిజర్వేషన్ లు ఇచ్చి దళిత, గిరిజన, బడుగుల అభ్యున్నతికి కృషి చేసింది ఇందిరమ్మ కాదా? యువతకు 18 ఏళ్లకు ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా? అంటూ తనదైన స్టైల్ లో ప్రతిపక్షనాయకులపై ఫైర్ అయ్యారు.

రాజీవ్ లేకపొతే ఇడ్లి, వడ అమ్ముకునేవాడివి..
ఈ సన్నాసులను అడుగుతున్నా.. పంచాయితీలకు నేరుగా నిధులను ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా? మహిళలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ కాదా. మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ. ఐదేళ్లు మహిళను మంత్రిని చేయని ఈ సన్నాసులకు ఏమీ తెలుసు. ట్విట్టర్, పిట్టర్ లో ఉండే సన్నాసి. రాజీవ్ లేకపొతే గుంటూరులో ఇడ్లి, వడ అమ్ముకునేవాడివి. రైల్వే స్టేషన్ లోనో.. సిద్దిపేటలో చాయ్ అమ్ముకునేవాడివి. రాజీవ్ గాంధీ ఇండియాకు కంప్యూటర్ తికురాకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. దిక్కుమాలినోడు మంత్రి అయ్యేవాడే కాదు. అధికారం పోయినా.. మదం తగ్గలేదు. గాడిదులకు గాంధీ ఏమీ తెలుసు. ఈ గాడిద గడిలల్లో గడ్డి మొలవాలన్న చాకలి ఐలమ్మ మాకు స్పూర్తి. రాజీవ్ సాక్షిగా చెబుతున్నా.. మీ ఫామ్ హౌస్ ల్లో జిల్లెడ్లు మోలిపిస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

విగ్రహాన్ని టచ్ చేయండి చూస్తా..
అలాగే తెలంగాణ తల్లిని విగ్రహం.. పెట్టకుండా పదేళ్లు ఏం చేసారని ప్రశ్నించారు సీఎం రేవంత్. సొంత విగ్రహం పెట్టుకోవాలని సన్నాసి ఈ స్థలం పెట్టుకున్నాడని ఆరోపించారు. నేను రాజీవ్ విగ్రహం అనగానే.. తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా? విగ్రహాన్ని టచ్ చేయండి చూస్తా. సచివాలయ గుండెలో ఉండాలనే.. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని.. డిసెంబర్ తొమ్మిన ప్రపంచం అబ్బుర పడేలా ఏర్పాటు చేస్తాం. మేమే దోచుకోవాలి.. దాచుకోవలే.. పంచుకోవాలి అని పదేళ్లు పాలించిన మిడతల దండును మనం అందరం పొలిమేర దాటిద్దాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisment
తాజా కథనాలు