CM Revanth Reddy: మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఈరోజు తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యాపిల్, ఫ్యాక్స్‌కాన్ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ చీఫ్ నియామకం వంటి అంశాలపై హైకమాండ్ తో చర్చించనున్నట్లు సమాచారం. వీటిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. పదవులపై అధిష్టానంతో చర్చ
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నట్లు సమాచారం.
Translate this News: