CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. పదవులపై అధిష్టానంతో చర్చ

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నట్లు సమాచారం.

New Update
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌తో భేటీ

CM Revanth Reddy: మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఈరోజు తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యాపిల్, ఫ్యాక్స్‌కాన్ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ చీఫ్ నియామకం వంటి అంశాలపై హైకమాండ్ తో చర్చించనున్నట్లు సమాచారం. వీటిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆరు పదవులు.. ఆశలో నేతలు...

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా పలు శాఖలకు ఇంకా మంత్రు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆరు మంత్రి పదవుల కోసం ఎంతో మంది నేతలు వేచి చూస్తున్నారు. కేబినెట్ లో సీటు కోసం హైకమాండ్ తో మంతనాలు జరుపుతున్నారు. ఆరు పదవుల కోసం పార్టీలో 60 మంది ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

మరో వైపు ఎమ్మెల్సీగా ప్రాణాస్వీకారం చేసిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు రేవంత్ కేబినెట్ లో సీటు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు విద్యాశాఖను ఇస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అందుకోసం ఇంకా ఆ శాఖను ఎవరికీ కేటాయించకుండా ఉంచారని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఒకవేళ కోదండరాంకు మంత్రి దక్కితే మరో 5 శాఖలు ఖాళీగా ఉండనున్నాయి. మరి అధిష్టానం మంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఇస్తుందో వేచి చూడాలి.

Also Read : ఆమ్మో మంకీ ఫాక్స్..హైదరాబాద్ కూడా అలెర్ట్ అవ్వాల్సిందే 

Advertisment
తాజా కథనాలు