Adilabad : ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎనలేని అభిమానం ఉందని తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. అంతేకాదు ఈ జిల్లాను తాను దత్తత తీసుకుని స్వయంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో భాగంగా ఆదివారం రాహుల్ గాంధీతో కలిసి నిర్వహించిన సభలో రాష్ట్రంలో నెలకొన్ని పలు అంశాలు, కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడారు.
ఒక్క గ్యారంటీ కూడా వదలిపెట్టం..
ఈ మేరకు మే 9లోగా రైతు భరోసా(Rythu Bharosa) ఇచ్చే బాధ్యత తనదేనని చెప్పారు. అలాగే హామీలు అమలు చేయడం లేదని కేటీఆర్ అంటున్నారు. ఒక్క గ్యారంటీ కూడా వదలిపెట్టం. అన్నీ అమలు చేస్తాం. ఒకసారి కేటీఆర్ ఆర్టీసీ బస్సు ఎక్కి చూస్తే తెలుస్తుంది.. హామీలు అమలు అవుతున్నాయో లేదో. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు' అంటూ విమర్శలు గుప్పించారు. విభజన హామీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలని కోరితే.. గాడిద గుడ్డు చేతిలో పెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి మోసపోవద్దని సూచించారు.
ఇది కూడా చదవండి: Addanki Dayakar: లఫూట్, చేతగాని దద్దమ్మ.. భార్యను ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడు?
ఇక ఆదిలాబాద్ గురించి మాట్లాడుతూ.. ఈ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానముందన్నారు. దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని చెప్పారు. మే 9వ తేదీలోపు రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు, ఆగస్టు 15 నాటికి ఒకే విడతలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.