Telangana New Governor : నూతన గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే.

Telangana New Governor : నూతన గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
New Update

CM Revanth Reddy Welcomes To Telangana New Governor : శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) లో తెలంగాణ (Telangana) నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). సీఎం రేవంత్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) గతంలో త్రిపుర మాజీ డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఈయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యకి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తాజాగా ఆయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలను అప్పగించింది. కాగా ఇన్నాళ్లు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది.

Also Read : సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ.!


#cm-revanth-reddy #hyderabad #telangana-governor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe