/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy-at-Yashoda-jpg.webp)
Telangana CM Revanth Reddy: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం పలువురు మంత్రులతో కలిసి ఆయన కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. కేసీఆర్ పక్కన ఉన్న కేటీఆర్, హరీష్ రావులతో మాట్లాడారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి వెంట మత్రులు సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు.
ఇదిలాఉంటే.. అంతకు ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం యశోద ఆస్పత్రికి వచ్చారు. సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. అయితే, కేసీఆర్‌కు చికిత్స అందుతున్న నేపథ్యంలో పొన్నం నేరుగా ఆయన వద్దకు వెళ్లలేదు. గది బయటే కేటీఆర్, హరీష్ ఉండగా.. వారితో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఉద్యమ నేత అని, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారని చెప్పారు పొన్నం.
Also Read:
చిన్న రాష్ట్రం.. మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకుంది..
అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్‌మెన్‌పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి