CM Revanth Reddy To Visit America Today : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమెరికా పర్యటన (America Tour) కు వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి బృందం బయలుదేరనుంది. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. అమెరికా లోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో పర్యటించనున్నారు. పది రోజుల పాటు అమెరికాలో ఉండనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. తిరిగి ఆగస్టు 14న హైదరాబాద్‌కు రానున్నారు.
సీఎం పర్యటన వివరాలు..
* 3న హైదరాబాద్ (Hyderabad) నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు చేరుకుంటారు.
* 4న న్యూజెర్సీలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.
* 5న న్యూయార్క్‌లో కాగ్నిజెంట్ సీఈవోతో, సిగ్నా సీనియర్ అధికారి, ఆర్‌సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులు, ఆర్గా సీఈవో రామకృష్ణ, పీ అండ్ వో సంస్థ సీవోవో శైలేష్ జెజురికర్, ర్యాపిడ్ 7 ప్రతినిధులతో భేటీ అవుతారు.
* 6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు.
* 7న ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటాయి.
* 8న కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈవో, ఆరమ్, ఆమ్‌జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం, సెలెక్ట్ టెక్ యూనికార్న్స్ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి, సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.
* 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ, స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ సందర్శన, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈవో, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలుస్తారు.
* 10న అమెరికా నుంచి బయలుదేరి 11న సియోల్ చేరుకుంటారు.
* 12న సియోల్‌లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో, పలువురు ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.
* 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్‌తో భేటీ, కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం, సామ్‌సంగ్, ఎల్‌జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు, హాన్ రివర్ ఫ్రంట్ సందర్శన ఉంటాయి.
* 14న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
Also Read : వైద్య రంగంలో మరో అద్భుతం.. 5వేల కిలోమీటర్ల నుంచి సర్జరీ!