Telangana : విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం నేడు తెలంగాణకు రానుంది. తెలంగాణలో పెట్టుబడులు (Investments) తెచ్చేందుకు ఈ నెల 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి బృందం మొదట అమెరికా పర్యటన (America Tour) కు వెళ్లారు. అక్కడ దాదాపు వీక్ వారం రోజులు పర్యటించారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీల సీఈఓలు, పెట్టుబడిదారులను కలిశారు. అనంతర అక్కడి నుండి దక్షిణ కొరియా (South Korea) లో పర్యటించారు.
దాదాపు 10 రోజులు విదేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనను ముగించుకొని ఈరోజు స్వదేశానికి చేరుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ విదేశీ పర్యటనలో సీఎం రేవంత్ బృందం దాదాపు రూ.31,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తెచ్చారు. మొత్తం 19 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
శంకుస్థాపన కార్యక్రమంలో...
తెలంగాణకు చేరుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు కోకాపేటలోని కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. ఈ నెల 5న తెలంగాణ సర్కార్ తో కాగ్నిజెంట్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఎంవోయూ కుదుర్చుకున్న 10 రోజుల్లోనే క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కాగ్నిజెంట్.
Also Read : మళ్ళీ బంగారం ధరల పరుగులు.. ఎందుకలా?