Revanth Reddy: వారం రోజుల్లో మరో 2 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ సర్కార్‌ శ్రీకారం!

ఆరు గ్యారంటీల్లోని మరో రెండు హామీలను వారం రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ సిద్దమయ్యింది. దీని గురించి సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా ప్రకటించారు. వారం రోజుల్లోనే రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
CM Revanth Reddy: మోడీ కేసులకు భయపడతానా?..  సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Congress To Implement Two More Guarantees: రాష్ట్రంలో మరో వారం రోజుల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ (Congress) సర్కార్‌ ముందడుగు వేసింది. తెలంగాణలో (Telangana) అధికారం చేపట్టిన 100రోజుల్లోపే ఆరు గ్యారంటీలను (Six Guarantees) ప్రజలకు అందిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధికారం చేపట్టి అప్పుడే 70 రోజులు గడిచిపోయింది.

ఈ క్రమంలో అధికారం చేపట్టిన మరుసటి రోజే ఆర్టీసీలో మహిళలకు మహలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ లిమిట్‌ రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచిన విషయం తెలిసిందే. మరోపక్క రాష్ట్రంలో ఆరు గ్యారంటీల విషయం గురించి నిత్యం కాంగ్రెస్‌ సర్కారుని ప్రశ్నిస్తునే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీకి గట్టిగా పట్టుబట్టి డిమాండ్‌ చేస్తున్నాయి.

మరో రెండు హామీలను...

ఆరు గ్యారంటీల్లోని మరో రెండు హామీలను వారం రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ సిద్దమయ్యింది. దీని గురించి సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా ప్రకటించారు. వారం రోజుల్లోనే రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder), 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ (Free Current) అమలు చేస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బుధవారం నాడు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో పర్యటించారు. రూ 4 వేల కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మరో వారం రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు మరి కొద్ది రోజుల్లో రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్లను అందిస్తున్నామని వివరంచారు.

అదే విధంగా అర్హులైన వారందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే నెల 16 లోగా రైతు భరోసా నిధులు కూడా అందజేస్తామని వివరించారు.

Also read: సినీ లవర్స్ కి బంపరాఫర్.. రూ.99 కే టికెట్‌ కానీ తెలంగాణలో మాత్రం షరతులు వర్తిస్తాయి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు