CM Revanth Reddy : ఈ రోజు తెలంగాణ ప్రజలకు పండగ రోజు

ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

TS Govt: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్!
New Update

Arogyasri : ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజు అని సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందని తెలిపారు. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని అన్నారు.

ALSO READ: ఆస్పత్రిలో కేసీఆర్ ఎలా నడుస్తున్నారో చూడండి.. వీడియో మీకోసం..

ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఆరోగ్యశ్రీ(Arogyasri) కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్యఖర్యులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. దీని ద్వారా రూ.10లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తాం అని హామీ ఇచ్చారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని తెలిపారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తాం అన్నారు.



#revanth-reddy-has-to-deliver-6-guarantees #congress-party #aarogyasri-card #cm-revanth-reddy #telugu-latest-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe