CM Revanth Reddy : ఈ రోజు తెలంగాణ ప్రజలకు పండగ రోజు ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. By V.J Reddy 09 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Arogyasri : ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజు అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందని తెలిపారు. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని అన్నారు. ALSO READ: ఆస్పత్రిలో కేసీఆర్ ఎలా నడుస్తున్నారో చూడండి.. వీడియో మీకోసం.. ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఆరోగ్యశ్రీ(Arogyasri) కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్యఖర్యులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. దీని ద్వారా రూ.10లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తాం అని హామీ ఇచ్చారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని తెలిపారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తాం అన్నారు. కొలువుదీరిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం... రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula చేతుల మీదుగా నేడు ప్రారంభం కానున్న రెండు పథకాలు. 'మహాలక్ష్మి' పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' పథకం ద్వారా… pic.twitter.com/aLA0W2QPi2 — Telangana CMO (@TelanganaCMO) December 9, 2023 #cm-revanth-reddy #telugu-latest-news #congress-party #aarogyasri-card #revanth-reddy-has-to-deliver-6-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి