Telangana Cabinet Expansion: కేబినెట్ విస్తరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కసరత్తులు మొదలుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే విస్తరణ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీ బయలుదేరగా.. ఈ రెండు, మూడు రోజులు పార్టీ పెద్దలతో వరుసగా భేటీ కానున్నారు.
ఆ జిల్లాలపై స్పెషల్ ఫోకస్..
ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు కేబినెట్‌లో చోటు దక్కకపోగా దీనిపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ జిల్లాల వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్ నుంచి ఇద్దరు మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి ఉండగా.. ఆదిలాబాద్ (Adilabad) నుంచి ముగ్గురు పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ బరిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి : Telangana: రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత
సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖరారు..
ఇదిలావుంటే.. నిజామాబాద్ (Nizamabad) నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్‌లో బెర్త్ ఖరారు అయినట్లు వార్తలొచ్చాయి. కానీ చివరికి ఆయనుకు పార్టీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఈసారి ఆయనకు తప్పకుండా స్థానం కల్పించాలని పార్టీ శ్రేణులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రానుండగా ప్రభుత్వం కేబినెట్ విస్తరణపై ఫోకస్ చేసింది.ఈ వారమే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
ఈసారి ఎలాగైనా గెలవాలని..
ఇక ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో 11 మంది మంత్రులుండగా మంత్రి వర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్ లభించే ఛాన్స్ ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. గతంలో హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందుకెళ్తుంది. మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రొఫెసర్ కోదండరాంను (Prof. Kodandaram) కూడా కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, లోక్‌సభ ఎన్నికలపై (Lok Sabha Elections) కూడా ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇక ఢీల్లీకి సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పయణమయ్యారు.