CM Revanth Reddy : 16 మంది ప్రధానులు చేయలేనిది మోదీ చేశారు : సీఎం రేవంత్

ప్రధాని మోదీపై సీఎం రేవంత్ విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు..11 ఏళ్లల్లో మోదీ చేసిన అప్పు రూ.లక్ష 15వేల కోట్లు అని ధ్వజమెత్తారు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారన్నారు.

New Update
CM Revanth Reddy : 16 మంది ప్రధానులు చేయలేనిది మోదీ చేశారు : సీఎం రేవంత్

PM Modi : కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). నిరసనలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు.. పదకొండేళ్లలో ప్రధాని మోదీ చేసిన అప్పు లక్షా 15వేల కోట్లు అని అన్నారు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారని పేర్కొన్నారు.

దేశంలో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru) ది అని అన్నారు. బ్యాంకుల జాతీయకరణతో ఇందిరమ్మ పేదలకు బ్యాంకులను అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. సాహసోపేత నిర్ణయంతో పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మది అని అన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ ప్రవేశ పెట్టిన మహానేత రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు.

హమ్ దో.. హమారే దో అన్నట్లు మోదీ అమిత్ షా (Amit Shah) వ్యవహారం ఉందని అన్నారు. ప్రపంచాన్ని దోచుకునేలా ఆ ఇద్దరి వ్యవహార శైలి ఉందని ఫైర్ అయ్యారు. సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి.. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలి.. జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలని అన్నారు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే.. అందుకే నేను ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చా అని అన్నారు.

దేశానికి బీజేపీ ముప్పుగా మారిందని అన్నారు. ఈ ముప్పును తొలగించాల్సిన బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని చెప్పారు. కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదు? అని నిలదీశారు. వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు.. బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడంలేదు.. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఈ దోపిడీ పై ఎందుకు మాట్లాడటంలేదు.. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం అనడానికి ఇది నిదర్శనం అని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు