Revanth Reddy Vs Harish Rao in Telangana Assembly: ఈ రోజు అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రావుల మధ్య మాటల యుద్దం జరిగింది. పరోక్షంగానే ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ దూషించుకున్నారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటూ రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ నుంచి తరిమికొడితే మహబూబ్‌నగర్ వాసులు ఎంపీగా గెలిపించారంటే పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ రేవంత్ విమర్శించారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..
అలాగే దక్షిణ తెలంగాణ మొత్తం కృష్ణా జలాలపై (Krishna River) ఆధారపడి ఉందన్న రేవంత్.. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్‌హౌస్‌లో ఉన్నాడంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎమ్మెల్యే హరీశ్ రావు.. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు. కొడంగల్ ప్రజలు తరిమితే.. మల్కాజిగిరి వచ్చావా? అంటూ రేవంత్ పై సెటైర్ వేశారు.
ఇది కూడా చదవండి : Assembly: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్
ఆ వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి..
అలాగే ప్రెసెంటేషన్ ఇవ్వాలని అడిగినా తమకు అవకాశం ఇవ్వలేదని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, ఇది మంచిది కాదంటూ హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో (Nalgonda) సభ పెట్టినం కాబట్టి.. వాళ్లు తప్పులను తెలుసుకున్నరన్నారు. కేసీఆర్ పై కోమటిరెడ్డి (Komatireddy) చేసిన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం, ప్రాజెక్టులు అప్పగించమని తీర్మానం చేయడాన్ని స్వాగతించారు హరీష్.
కేసీఆర్ కుర్చీపై..
ఇక అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కేసీఆర్ కుర్చీ మొన్న వరకూ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఆయన సీట్లో పద్మారావు కూర్చున్నారు. దీంతో తనకు చాలా సంతోషంగా ఉందని, ఆ సీటు పద్మన్నకు ఇవ్వడం మంచిద రేవంత్ అన్నారు. పద్మరావు ఉద్యమ కారుడని, ఆయనకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని సభలో రేవంత్ తెలిపారు.