Supreme Court : రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ వెంటనే అమలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు.

Supreme Court : రిజర్వేషన్లపై  సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
New Update

CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ (SC And ST Classification) పై సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). వర్గీకరణను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉందని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎం,ముందుగా తెలంగాణ (Telangana) లో వర్గీకరణ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణపై తెస్తామని.. అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. వర్గీకరణపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం తోనే సుప్రీం కోర్టు వర్గీకరణపై సానుకూల తీర్పు వెలువరించిందని అన్నారు.



Also Read : ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

#cm-revanth-reddy #supreme-court #sc-st-reservations
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe