CM Revanth: కేసీఆర్ దుర్మార్గుడు... చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందిని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి చేసిన పాపాలకు లెక్కలు లేవని సంచలన ఆరోపణలు చేశారు.

Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి
New Update

CM Revanth Reddy: కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. 2014 నుంచి జరిగిన ఒప్పందాలనపై సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వంపై రుద్దాలని కేటీఆర్, హరీష్ రావులు ప్రయత్నిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం కృషా, గోదావరి నదులపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేసిందని పేర్కొన్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేసి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందిని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి చేసిన పాపాలకు లెక్కలు లేవని సంచలన ఆరోపణలు చేశారు.

ALSO READ: ఖమ్మంలో నడిరోడ్డుపై గ్యాంగ్‌ వార్‌.. సీపీ సీరియస్

2014లో పునర్విభజన చట్టం కేసీఆర్ లోక్ సభ లో ఆమోదం పొందిందని అన్నారు. ఈ చట్టం ఆమోదం పొందినప్పుడు కేసీఆర్ అంగీకారం తెలిపారు. బీఆర్ఎస్ ఆమోదం మేరకే చట్టం వచ్చిందని పేర్కొన్నారు. విభజన చట్టంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ, ఇతర అంశాలు క్లియర్ గా ఉన్నాయని అన్నారు. ఇప్పుడు చట్టం వల్ల తెలంగాణకు ఏదైనా నష్టం జరిగితే అది కేసీఆర్ దే బాధ్యత అని సీఎం రేవంత్ తెలిపారు. శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రకు కేసీఆర్ దయాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయిత అని పేర్కొన్నారు.

2015లో జరిగిన KRMB మీటింగ్ లో తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు చాలని కేసీఆర్ అంగీకరించారని అన్నారు. కృష్ణా నీటిలో ఇప్పుడు 50 శాతం వాటా కావాలని కేసీఆర్ అడుగుతున్నారని పేర్కొన్నారు. పరివాహక ప్రాంతం ఎంతైతే రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ చట్టాల్లో ఉందని రేవంత్ అన్నారు.

DO WATCH: 

#ktr #kcr #cm-revanth-reddy #krmb
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe