CM Revanth Reddy: టీడీపీతో బీజేపీ పొత్తు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. నేతలపై అక్రమ కేసులు పెట్టి.. వారితో ప్రధాని మోడీ పొత్తులు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. న్డీయే కూటమి మొత్తం అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు.

New Update
CM Revanth Reddy: టీడీపీతో బీజేపీ పొత్తు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: మేడ్చల్‌లో కాంగ్రెస్ శనివారం ప్రజాదీవెన సభలో ఏపీలో రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడంపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి రాష్ట్రంలో ప్రధాని మోడీ పొత్తులు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. దేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా ఉంటే పొత్తులు పెట్టుకోవడం ఎందుకు అని బీజేపీ ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి.. వాళ్ళతోనే పొత్తులకు దిగారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమి మొత్తం అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు.

ALSO READ: ముందు క్షమాపణ చెప్పు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందా?..

ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ కూలిపోతుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని అంటున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ఎవరికైనా ఉందా?.. ఎవరికైనా దమ్ముంటే తమను ఒకసారి టచ్ చేసి చూడండి అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మంచి వాళ్ళు కాబట్టి ఇంకా అలా అన్న నేతలు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారని అన్నారు. ఒకవేళ మా కార్యకర్తలు తిరగబడితే ఫామ్ హౌస్ గోడలు కాదు ఇటుకలు కూడా మిగలవాని హెచ్చరించారు.

మీ అయ్యాను అసెంబ్లీ రమ్మను.. 

ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. GO.3, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కవితకు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల్లో 43 శాతం మహిళలకు కల్పించిందని.. లెక్కలు కావాలంటే మీ అయ్యాను (కేసీఆర్) అసెంబ్లీ రమ్మని చెప్పాలని కవితను అన్నారు. గతంలో  ధర్నా చౌక్ వద్దన్నారు.. ఇప్పుడు వీళ్ళే వెళ్లి అక్కడ సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ  రిపేర్ చేయాలని కేసీఆర్ అంటున్నారని.. ఒకవేళ అది రిపేర్ చేస్తే.. అది కొట్టుకపోతే తమ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలనీ చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు