CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది మార్పు

సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చివేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత, అధికారిక సమాచారం ఇతరులకు చేరవేస్తున్నారనే అనుమానాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే సీఎం కాన్వాయ్‌ లో కూడా మార్పులు చేసింది.

New Update
CM Revanth Reddy: వాటిని మాకు మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌ వినతి..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై (CM Revanth Security Breach) ఇంటెలిజెన్స్‌ బ్యూరో (Intelligence Bureau) స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. రేవంత్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని కానీ సిబ్బందిని కానీ రేవంత్ దగ్గర పెట్టొద్దని ఆదేశాలు ఇచ్చింది. సీఎం రేవంత్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ లీక్‌ అవుతోందని సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ISW అధికారులను మార్చేసింది ఇంటెలిజెన్స్ విభాగం.

ALSO READతెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు

కేసీఆర్‌కు లీకులు..?

తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి సీఎం అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. సీఎం అయినప్పటి నుంచి తన అధికారిక సమాచారం తో పాటు వ్యక్తి గత సమాచారం బీఆర్ఎస్ నేతలకు అందుతుందని సీఎం రేవంత్ గమనించారు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ తెలంగాణ సీఎం గా ఉన్నప్పుడు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కి ఉండడమే. సీఎం రేవంత్ యొక్క సమాచారాన్ని వీరు కేసీఆర్ కు, బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారనే అనుమానంతో వారందరిని సీఎం యొక్క సెక్యూరిటీ నుంచి తొలిగించింది ఇంటెలిజెన్స్ బ్యూరో.

కాన్వాయ్‌ మార్పు..

తెలంగాణ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. తన సెక్యూరిటీ కోసం కొత్త కాన్వాయ్‌ ను తీసుకోనని.. ప్రభుత్వ పైసలను వృధా చేయనని.. తన సొంత కారులోనే ప్రయాణిస్తానని గతం లో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి భద్రత బలగాలను మార్చిన ఇంటెలిజెన్స్ బ్యూరో సీఎం కాన్వాయ్‌ లో మార్పులు చేసింది. సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని అన్ని కార్లు నలుపు రంగులోకి మార్చింది. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ కార్లనే సీఎం రేవంత్ కాన్వాయ్‌ లో చేర్చడం విశేషం. ఇకపై సీఎం రేవంత్ కాన్వాయ్‌ లో అన్ని ల్యాండ్ క్రూజర్ కార్లే ఉండనున్నాయి.

Also Read: చంద్రబాబు అరెస్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
తాజా కథనాలు