Caste Census in Telangana: త్వరలో తెలంగాణలో కులగణన!

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో కులగణన చేపట్టనున్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కులగణన చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Caste Census in Telangana: త్వరలో తెలంగాణలో కులగణన!
New Update

Caste Census in Telangana: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కులగణన చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ కసరత్తు ప్రారంభించింది.

ALSO READ: మరో 70రోజుల్లో ఎన్నికలు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మొదలైన కులగణన...

మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ సీఎం జగన్ (CM Jagan) ఏపీలో కులగణన ప్రక్రియకు ప్రారంభించారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. లేదు ప్రజలు సంక్షేమం కోసమే తాము కులగణన చేస్తున్నామని వైసీపీ పేర్కొంది. ఇదిలా ఉండగా..  గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో ఏపీలో ఉన్న కోటీ 60 లక్షల కుటుంబాలను కులగణన సర్వే చేస్తోంది ఏపీ (AP) సర్కార్. రాష్ట్రంలో ఉన్న మొత్తం 723 కులాలకు సంబందించి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా విభజించనున్నారు. బుడగ జంగాలు, పిరమలై కల్లర్(తేవర్), యలవ కులాలను ఇతర కులాల జాబితాలో నమోదు చేస్తారు. జనవరి 19 ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 28 వరకూ మొత్తం పది రోజులపాటు జరగనుంది. వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఒకవేళ ఎవరన్నా మిస్ అవుతే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకూ దగ్గరలోని సచివాలయంలో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది వైసీపీ ప్రభుత్వం.

బీహార్ లో పూర్తి..

దేశంలో మొట్టమొదటి సరిగా కులగణన (Caste Census) చేపట్టింది బీహార్ సర్కార్. ఆ తరువాత స్థానాన్ని ఆంధ్ర ప్రదేశ్ కైవసం చేసుకుంది. ఇటీవల బీహార్ లో కులగణన ప్రక్రియ ముగిసింది. కులగణన చేయడం ద్వారా బీహార్ లో జనాభా భారీగా పెరిగిందని అక్కడి ప్రభుతం పేర్కొంది. అయితే.. ఈ కులగణన ప్రక్రియకు కేంద్రం లో ఉన్న బీజేపీ వ్యతిరేకిస్తోంది. కుల గణనపై ఎప్పటికప్పుడు కేంద్రం దాటవేస్తుంది. కేంద్రం తీరును పక్కకు పెట్టి వరుసగా కుల గణన చేపడుతున్నాయి రాష్ట్రాలు.

ALSO READ: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి… షర్మిల సంచలన వ్యాఖ్యలు

 

#cm-revanth-reddy #telangana-latest-news #telangana-caste-census #caste-census-in-telangana #caste-census
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe