CM Revanth : ఇరిగేషన్‌ శాఖపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఇరిగేషన్ శాఖ మీద ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. దీంటో ఇటీవల ఇరిగేషన్ శాఖ మీద జరిగిన విజిలెన్స్ దాడులు పై కూడా చర్చించనున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చ జరగనుందని సమాచారం.

Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
New Update

Medigadda Project : రెండు రోజుల క్రితం మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Project) కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేంది. దీని ప్రకారం ఈనెల 9వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు(Vigilance officers) సోదాలు నిర్వహించారు. దాంతో పాటూ హైదరాబాద్‌ జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలోని రెండు, నాలుగో అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీని మీద ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించనున్నారు. దీంతో పాటూ కాళేశ్వరం నిర్మాణం, పెండింగ్ పనుల మీద కూడా చర్చ చేయనున్నారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్(Uttam Kumar Reddy), నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులుకూడా హాజరుకానున్నారు.

Also Read:పండక్కి ఊరు వెళుతున్న సిటీ..జనాలతో నిండిపోయిన రోడ్లు

హైదరాబాద్‌తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో పది ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. 12 బృందాలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. మహాదేవపూర్‌లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌హౌజ్‌లకు సంబంధించిన కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగ్‌ రిపోర్టులో అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ అధికారులు ఫోకస్‌ చేస్తున్నారు. వాటికి సంబంధించి ఆఫీసుల్లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : PM KISAN: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.8,000!

హైకోర్టు సీజేకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

ఇక తెలంగాణ హైకోర్టు సీజేకి(High Court CJ) రాష్ట్ర ప్రభుత్వం(Congress Government) లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీకి సిట్టింగ్‌ జడ్డిని కేటాయించాలని రేవంత్ సర్కార్ లేఖలో కోరింది. మేడిగడ్డపై(Medigadda Project) విజిలెన్స్‌ విచారణలో రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌, సీఏ పేర్లు ఉన్నట్లు తెలిపింది. జ్యుడిషియల్‌ విచారణ, విజిలెన్స్‌ విచారణలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు..? ఏం చేశారు..? కాంట్రాక్టు ఎలా ఫైనల్‌ అయ్యింది..? అనే అంశాలపై విచారణ చేయాలని విజిలెన్స్‌, జ్యుడిషియల్‌ ఎంక్వైరీలో తెలంగాణ ప్రభుత్వం చేర్చింది.

Also Read : పండక్కి ఊరు వెళుతున్న సిటీ..జనాలతో నిండిపోయిన రోడ్లు

#cm-revanth-reddy #uttam-kumar-reddy #medigadda-barrage #kaleshwaram-lift-irrigation-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe