CM Revanth Reddy : రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై కీలక ఆదేశాలు! రైతు రుణమాఫీ , ధాన్యం కొనుగోళ్ల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్ నిర్వహించారు By Bhavana 16 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) , ధాన్యం కొనుగోళ్ల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్ నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్(Election Code) ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలపై అధికారులతో చర్చలు జరిపారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేసే విధంగా చూడాలని అన్నారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలనన్నారు. అలాగే వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్ల(Rice Millers) పై ఉక్కు పాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. Also read: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు! #rythu-runa-mafi #telangana #revanth-reddy #farmers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి