CM Revanth: అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదన్నారు. బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.
మే 1న విచారణ..
ఈ మేరకు రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్(Congress) నేతలకు సమన్లు ఇచ్చారు. సీఎం రేవంతోపాటు మే 1న విచారణకు రావాలని తెలిపారు. ఢిల్లీ నుంచి 8 మంది అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుని, తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్‌కు సీఆర్పీ 81 కింద నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. అలాగే ఈ అంశంపై వేగంగా విచారణ చేయాలని పోలీసులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తొలి అరెస్ట్!
మరోవైపు ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ క్రియెట్ చేసిందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. తెలంగాణలో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో అమిత్ షా మాట్లాడిన మాటలే మార్ఫింగ్ చేయడం.. ఈ మధ్య కాలంలో రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా బీజేపీ మీద ఆరోపణలు చేస్తుండడమే వారి అనుమానాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇలాంటి పనులు చేసేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దాంతో పాటూ ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.