BREAKING : సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ను ఆపవద్దని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సాధారణ ట్రాఫిక్ తోనే తన కాన్వాయిని అనుమతించాలని అన్నారు. అలాగే ఇందిరా పార్క్ వద్దే ధర్నా చౌక్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

New Update
Dharani Portal: ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ను ఆపవద్దని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సాధారణ ట్రాఫిక్ తోనే తన కాన్వాయిని అనుమతించాలని అన్నారు. అలాగే ఇందిరా పార్క్ వద్దే ధర్నా చౌక్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ తరహాలో ధర్నా చౌక్ వద్ద ఏర్పాట్లు చేయనున్నారు.

ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ అంశంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు.

ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రెనోవేట్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శేషాద్రి, హైదరాబాద్(Hyderabad), రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ALSO READ: BREAKING: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు

ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునే హక్కు ఉంది: సీపీ శ్రీనివాస్ రెడ్డి

ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునే హక్కు ఉందని అన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. ఇందిరాపార్క్‌లో ధర్నాలకు అనుమతి ఉందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో తమ నిరసనలు తెలియజేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ధర్నాలు చేసే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అని తెలిపారు. ధర్నాచౌక్‌పై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తాం అని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యపై రివ్యూ చేస్తున్నామని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ఈరోజు 8,000 మంది హాజరయ్యారని వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు