New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది రేవంత్ సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అలాగే కాళేశ్వరంపై న్యాయవిచారణ చేసేందుకు కమిటీ ఏర్పటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

New Update
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

New Ration Cards in Telangana: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజల పై హామీల వర్షం కురిపించింది. ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే అర్హులు అందరికి తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాగా ఇటీవల ఆరు గ్యారెంటిలకు దరఖాస్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చిన ధరఖాస్తులలో కొత్త రేషన్ కార్డులకే కోటికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేసింది రేవంత్ సర్కార్. సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంపై జీవో విడుదల చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని వెల్లడించారు.

మహిళల సంక్షేమానికి  పెద్ద అడుగు..

మహిళల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ పెద్ద పీఠ వేసింది. ORR వెలుపల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు మార్కెట్ సదుపాయం కల్పించనుంది. ORR చుట్టూ 25 నుంచి 30 ఎకరాల్లో మార్కెట్ సదుపాయం కలిపించనుంది. అలాగే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించనుంది.

రైతు బంధుపై కీలక ప్రకటన..

రైతు బంధుపై కీలక ప్రకటన చేశారు మంత్రి శ్రీధర్ బాబు. రెండు రోజుల్లో 93 శాతం మందికి రైతు బంధు డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికి వరకు నాలుగు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతు బంధు జమ చేసినట్లు తెలిపారు. అలాగే రైతు రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దీనిపై కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

Also Read: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలింది.. సీఎం రేవంత్!

Advertisment
తాజా కథనాలు